షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టంపై చట్ట సభల్లో ప్రస్తవించాలి

పోలవరం ముంపుకు గురుతున్న ప్రతి ఆదివాసి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి

పయనించే సూర్యుడు ప్రతినిధి నరేష్ కునవరం, మార్చి 11 షెడ్యూల్ ప్రాంతం ఉద్యోగ నియమకల చట్టం వెంటనే చేయాలని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఏజెన్సీలో 100% ఉద్యోగాలు స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేయాలని, పోలవరం ముంపు మండలాల పర్యటనలో భాగంగా కూనవరం విచ్చేసిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ళ బోజ్జి రెడ్డికి స్థానిక ఆదివాసి సంఘాల నాయకులు వివరించడం జరిగింది. ముందుగా బొజ్జి రెడ్డిని సంఘాల నాయకులు సాల్వతో సత్కరించినా అనంతరం సమస్యలు వివరిస్తూ,పోలవరం ముంపుకు గురవుతున్న ప్రతి ఆదివాసి కుటుంబంలో చదువుకున్న నిరుద్యోగి ఉంటే కుటుంబం కి ఒక్కొక్కరు చొప్పున ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని అదేవిధంగా ముంపు వలన ఈ ప్రాంతంలో టూరిజం బోటింగ్ ఫిసరింగ్ లాంటివి అన్నీ కూడా ఆదివాసులతోనే కొనసాగించాలని, చైర్మన్ కి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్, జిల్లా అధ్యక్షులు సోడే ముత్తయ్య, సీనియర్ నాయకులు జోడే నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *