సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వై.నరోత్తం

పయనించే సూర్యుడు మార్చ్ 11 (జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం నివాళులర్పించారు. మంగళవారం కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నరోత్తం, ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడబిడ్డల చదువు కోసం, వారి అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన గొప్ప చైతన్య మూర్తి, సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు స్వామి దాస్, రాచన్న, శివ కుమార్, ఎస్.గోపాల్, జి.మల్లేశం, భూమ్ రెడ్డి, ఎస్.వెంకట్, చెంగల్ జైపాల్, సంగన్న, ఎం.జైపాల్, శ్రీనివాస్, లాజర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *