సావిత్రిబాయి ఫూలే  జీవితం ఆదర్శనీయం

★ బాలికా విద్యకు మార్గదర్శి సావిత్రిబాయి ఫూలే ★ సావిత్రిబాయి ఫూలే   చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సేవలను స్మరించుకున్నా ఉపాధ్యాయులు

పయనించే సూర్యుడు మార్చి 11 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ఉట్నూర్ మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సేవలను స్మరించుకున్నారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. బాలికల విద్యా విస్తరణకు సావిత్రిబాయి చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు. మహిళలు చదువుకోవడం సమాజం వ్యతిరేకించిన కాలంలోనే ఆమె ధైర్యంగా ముందడుగు వేసి బాలికలకు విద్యాబోధన ప్రారంభించారని గుర్తుచేశారు. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఫూలే దంపతులు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు విద్యార్థులు సావిత్రిబాయి జీవిత విశేషాలపై ప్రసంగాలు చేసి ఆమె ఆశయాలను కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు. నేటి యువత ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్య ద్వారా ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఉపాధ్యాయులు సూచించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.