సూళ్లూరుపేట పట్టణంలో కల్లు దుకాణంలో జోరు అడిగే నాథుడు లేడు

*పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు *అయ్యప్ప స్వామి గుడి ఆనుకుని కల్లు దుకాణమా... *చెంగాలమ్మ గుడి వాటంబెడు రోడ్డు ఆనుకుని కల్లు దుకాణమా. *సూళ్లూరు స్మశాన వాటికను కూడా వదలని కల్లు వ్యాపారస్థులు సూళ్లూరు స్మశాన వాటిక దగ్గర కల్లు దుకాణం ఎత్తివేయాలని స్థానిక మహిళలు కల్లు దుకాణం ఎత్తివేయాలాని నిరసన వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు..* *లైసెన్స్ లేని కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు ప్రేమ ఎందుకో. *ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు కల్లు దుకాణలు నడిపే వారికి కల్లు లైసెన్స్ లు ఉన్నట్టా, లేనట్టా. *అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ప్రజలలో చర్చనీయాంసమైంది

పయనించే సూర్యుడు మార్చి 11 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట పట్టణంలో కల్లు షాపులు జోరు సూళ్లూరుపేట మున్సిపల్ పరిధిలో ఒక్క సూళ్లూరుపేట లోనే 10 కి పైగా కల్లు దుకణాలు విచ్చలవిడిగా సాగిస్తున్నారు. కానీ సూళ్లూరుపేట సంబంధిత అధికారులు మాత్రం అసలు కల్లు దుకణాలకు లైసెన్స్ వుందా లేదా అని అడగకపోవడం పట్ల స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈ సందర్భంగా ఒక్క సూళ్లూరుపేట నడిభోడ్డులోనే ఇలా వుంటే ఇక సూళ్లూరుపేట మండలంలో గ్రామాల యందు కల్లు షాపులు జోరుగా ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు , ముఖ్యంగా సూళ్లూరుపేట పట్టణంలో దేవాలయం, మరియు స్కూల్ పరిసర ప్రాంతాల్లో కల్లు దుకాణలు నడుపుతున్నారని పట్టణ స్థానికులు పేర్కొంటున్నారు. కల్లు దుకాణాలు వద్ద కల్లు ప్రియులు ఆగడాలు అధికంగా ఉన్నాయని గ్రామీణ ప్రాంతాల మహిళలు వాపోతున్నారు. సూళూరుపేట ఎక్సైజు ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలయందు అనేక విమర్శలు వస్తున్నాయి, అలాగే కల్లు నడిపే వారికి కల్లు లైసెన్స్ లు ఉన్నాయా లేవా అని చర్చనీయాంసం అయింది.పైగా గ్రామ నందు తరచూ గొడవలు వస్తుండడం వలన ముఖ్యంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంతో ఎక్సైజ్ ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *