1/70 యాక్ట్ ను అతిక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం

పయనించే సూర్యుడు మార్చి 11 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ చుంచుపల్లి తండా పంచాయతీలో అక్రమ వెంచర్ల దందా: నిబంధనలు గాలికి.. రియల్ మాఫియా గుప్పిట్లో భూములు! అనుమతులు లేని లేఅవుట్లతో సామాన్యులకు కుచ్చుటోపి అక్రమ వెంచర్ల దందా.. అధికారుల ‘మామూలు’ మౌనం నిబంధనలు గాలికి.. అమాయక ప్రజలకు కుచ్చుటోపి చుంచుపల్లి అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు చుంచుపల్లి మండలంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ విక్రయాలు చుంచుపల్లి తండా గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, కనీస అనుమతులు లేకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ లేఅవుట్లను ఏర్పాటు డిటిసిపి అనుమతులు లేకుండా, వ్యవసాయ భూములను నాలా (ఎన్ ఏ ఎల్ ఏ )కన్వర్షన్ చేయకుండానే ప్లాట్లుగా విడగొట్టి విక్రయిస్తున్నారు. అధికారుల నిమ్మకు నీరెత్తిన తీరు క్షేత్రస్థాయిలో అక్రమ వెంచర్లు వెలుస్తున్నా, సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వ అధికారులు ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు అనే సందేహం కలుగుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *