29 రోజుల సమ్మెకాల వేత నాన్ని వెంటనే చెల్లించాలి

* డిటిఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ శ్రీనివాస్ డి సూర్య ప్రకాష్

పయనించే సూర్యుడు మార్చి 11 (జనగామ ప్రతినిధి కమ్మగానినాగన్న)సముగ్ర శిక్ష ఉద్యోగులకు పేస్కేలు వేతనాలు చెల్లింపడంతో పాటుగా గత సంవత్సరంలో చేపట్టిన 29 రోజుల సమ్మెకాల వేతనాన్ని వెంటనే చెల్లించాలని డి టి ఎఫ్ పాలకుర్తి మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిదురాలశ్రీనివాసు, దేవగిరి సూర్యప్రకాష్ లు సంయుక్తంగా ప్రభుత్వాన్ని డిమాండు చేసారు. మంగళ వారం వారు మండల కమిటి సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా చాలిచాలని వేతనాలతో సమగ్రశిక్ష ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతూ ప్రభుత్వ విధివిధానాలు అమలు పర్చడంలో ఎం ఈ ఓ ఉపాధ్యాయులకు చేదేడో, వాదోడుగా ఉంటూ తమ జాబ్ చార్టును సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారు. వారికి ముఖ్యమంత్రి టిపిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డి టి ఎఫ్ పాలకుర్తి మండల శాఖ డిమాండు చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *