అంగన్వాడి కేంద్రంలో ఘనంగా అన్నప్రాసన కార్యక్రమం.

పయనించే సూర్యుడు మార్చి 12, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో వీరభద్రం – మమత దంపతుల కుమార్తె సమేక్షకు అంగన్వాడి సూపర్వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అన్నప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతరం ఎఎల్ఎంసి కమిటీ సమావేశం నిర్వహించారు. సూపర్వైజర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కమిటీ సభ్యులు ప్రతినెల జరిగే ఎఎల్ఎంసి కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు అందించే పౌష్టికాహారం వల్ల కలిగే ప్రయోజనాలను తల్లులకు వివరించారు. అలాగే ప్రీ-స్కూల్ పిల్లలకు అందిస్తున్న విద్యా కార్యక్రమాల గురించి కూడా అవగాహన కల్పించారు. అదేవిధంగా గర్భిణి స్త్రీలకు మరియు బాలింతలకు స్వయంగా భోజనం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం హేమలత, స్కూల్ హెచ్‌ఎం సీతా, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, గర్భిణీలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.