పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 12 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా పలాస నియోజకవర్గం వజ్రపూ కొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర్ బీచ్‌లో స్వయంగా చెత్తను సేకరించి, ప్రజలకు మరియు యువతకు ఆదర్శంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నిలిచారు. సముద్ర తీరాలను, పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి సామాజిక బాధ్యత అని ఆమె తెలిపారు.మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, స్వచ్ఛమైన సమాజం కోసం మనమూ అడుగులేద్దాం అని ప్రజలను ఉద్దేశించి అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, వజ్రపుకొత్తూరు మండల అధికారి రమేష్ నాయుడు, వజ్జ బాబురావు, పిరికఠ్ల విఠల్ రావు, మండల అధ్యక్షుడు సూరాడ మోహనరావు, గోరకల వసంత స్వామి, ఉమామహేశ్వరరావు ,శశి భూషణ్, సింగుపల్లి బాలక్రిష్ణ, మల్లా శ్రీనివాసరావు, మారడ దుర్యొధన, కూటమి నాయకులు, మున్సిపాలిటీ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
