అడ్డతీగల నుంచి లబ్బర్తి వరకు బీటి రోడ్డు నిర్మాణం తక్షణమే ప్రారంభించాలి.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.12.2026 ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ..పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం,అడ్డతీగల మండల పరిధిలోని అడ్డతీగల గ్రామం నుండి వయా డి.భీమవరం మీదుగా లబ్బర్తి వరకు సుమారు16కిలోమీటర్ల వరకు బిటి రోడ్డు ఈ ప్రభుత్వం మంజూరు చేసి సుమారు సుమారు 8 నెలలు కావస్తున్న ఎడ్మిక్స్ కాంట్రాక్టర్ పూర్తి చేయకుండా గుత్తేదారి పూర్తిస్థాయి పనులు చేయకుండా బిల్స్ వస్తేనే చేస్తానన్నటువంటి. వ్యక్తులకు కాంట్రాక్టులు ఇవ్వడం. ఎంతవరకు సమంజసమని ఆదివాసీ జేఏసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.ఈ రోడ్ల వల్ల టూ వీలర్ వెహికల్ వాహనదారులు, ఆటోలు కానీ ఈ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వాలు మా గిరిజన ప్రాంతాలకు అద్దంలో చూపిస్తున్నాయి,ప్రభుత్వ పథకాలు అందని ద్రాక్షగా గిరిజనులకు మిగులుతున్నాయన్నారు.కా నీ అందుకునే విధంగా చేయడం లేదని ఇవంతా కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోతాయి అనేటువంటి ఆందోళన చేశారు. ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో ఉన్న రోడ్డులను పరిశీలించామన్నారు. కావునప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణమే బీటు రోడ్డు పనులు ప్రారంభించాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర, గంపా నాగరాజు, అందాల లింగారెడ్డి, యాట్ల సరస్వతి, కోసూరి రాజారెడ్డి, గిరిజ, విజయ కుమారి, ధమాయంతి, ప్రభావతి, బొంజి బాబు, లక్కువెంకట్, చిట్టి బాబు, కె.శ్రీను మొదలైన వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *