అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: బీఆరెస్ నాయకులుకొంచె శివరాజ్.

పయనించే సూర్యుడు, మార్చి12రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మియాపూర్ మక్త మహుబూబ్ పెట్ బీఆరెస్ నాయ కులు కొంచె శివరాజ్ ముదిరాజ్ అన్నా రు. మంగళవారం మక్త మహుబూ బ్ పెట్ నందు మసీదులో లోని,కిరణ్ జహంగీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు కొంచె శివరాజ్ పల్గాన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…ముస్లిం సహోదరులు పవిత్ర రంజాన్ పండుగను భక్తిశ్రద్దలతో చేస్తారన్నారు.ముస్లిం సోదరులతో కలిసి నమాజ్‌ చేశారు.అనంతరం వారితో కలిసి ఇఫ్తార్‌ విందు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.ముస్లిం సోదరులకు ఈద్‌ ముబారక్‌ అంటూ ఉర్దూలో ముందస్తు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజే శారు.అందరి ప్రార్ధనలు సఫలం కావాలని ఆకాంక్షించారు.అల్లాహ్‌ చల్లని ఆశీస్సుల తో అందరూ బాగుండాలని ఎమ్మెల్యే కృష్ణారావు కోరుకున్నారు.