అశ్వాపురం గ్రామపంచాయతీ లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

* సర్పంచ్ సదర్ లాల్ ఆధ్వర్యంలో మంచి నీటి ట్యాంకు మరియు ట్యాంక్ పరిసరాల పరిశుభ్రం.

పయనించే సూర్యుడు, మార్చి 12, : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక (99 రోజుల) కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా అశ్వాపురం గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ బానోత్ సదర్ లాల్ ఆధ్వర్యంలో మంచి నీటి ట్యాంక్ లను శుభ్రపరచడం, చెత్త చెదారం తొలగింపు, క్లోరినేషన్ పనులు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం నందు ఉప సర్పంచ్ తుళ్ళూరీ ప్రకాష్ రావు, పంచాయతీ కార్యదర్శి కందిమళ్ల శ్రీకాంత్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *