పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 12 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ 7వ వార్డులో ఏళ్ల తరబడి నెలకొన్న విద్యుత్ సమస్య పరిష్కారమైంది. ఆ ప్రాంతంలో సరైన విద్యుత్ స్తంభం, వీధి దీపాలు లేక స్థానికులు చీకట్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వార్డు కౌన్సిలర్ కొల్లి రవికిరణ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయించి, వీధి దీపాలను అమర్చారు.