ఆంజనేయ స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ 1,71 లక్షలు

పయనించే సూర్యుడు-12-03-2026-రాజంపేట న్యూస్ : కడప ప్రధాన రహదారిలోని ఆంజనేయస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ 1,71,203 లు వచ్చిందని ఆలయ చైర్మన్ తలిశెట్టి రమేష్ తెలియజేశారు. బుధవారం ఇన్స్పెక్టర్ జనార్ధన్, ఈవో వెంకటసుబ్బారెడ్డి, ఆలయ చైర్మన్ తలిశెట్టి రమేష్, గౌరవ అధ్యక్షులు పప్పు శెట్టి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి కంటి రవికుమార్, నాగభూషణం ఆచారి, నాగ ముని ఆచారి, నాలం శివకుమారి, బొమ్మ రామసుబ్బమ్మ, లక్ష్మీపతి రాజు, దగ్గుపాటి రవికుమార్, ఆలయ అర్చకులు యతిరాజు రవికుమార్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ తలిశెట్టి రమేష్ మాట్లాడుతూ గతంలో లెక్కించినప్పుడు వచ్చిన మొత్తం రూ 79 వేల 110 రూపాయలు కంటే ఈ ఏడాది 92 , వేల 93 రూపాయలు ఆదాయం పెరిగినట్లు తెలియజేశారు ఆలయ అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ లేకుండా భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి చేస్తామని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *