ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గా నియమితులైన విట్టా రమేష్

★ బీజేపీ నాయకులు విట్టా రమేష్ ను ఘనంగా సత్కరించిన ఆదోని సెంట్రల్ మండలం బీజేపీ నాయకులు.

పయనించే సూర్యుడు మార్చి 12 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. భారతీయ జనతా పార్టీ ఆదోని పట్టణ సెంట్రల్ అధ్యక్షులు తోవి నాగార్జున ఆధ్వర్యంలో, బీజేపీ సీనియర్ నాయకులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త విట్టా రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ భవన నిర్మాణ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ఆదోని పట్టణంలోని స్థానిక భీమాస్ కార్యాలయంలో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి విట్టా రమేష్ సేవలు మరింతగా ఉపయోగపడతాయని, రాష్ట్ర స్థాయిలో ప్రతీ జిల్లాలో పార్టీ భవన నిర్మాణాలు వేగవంతంగా పూర్తయ్యేలా ఆయన సమర్థవంతంగా పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మాలేకర్ శ్రీనివాసులు, మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు లోకేష్ కుమార్, బీజేపీ ఆదోని పట్టణ సెంట్రల్ ప్రధాన కార్యదర్శులు రమేష్ ఆచారి, వినితా గుప్తా, ఉపాధ్యక్షులు మరియాని చెన్న బసప్ప, గోల్డ్ రాజు, ప్రశాంత్, సెంట్రల్ యువ మోర్చా అధ్యక్షులు దాసరి నరసింహ, అలాగే మండల కమిటీ పదాధికారులు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.