పయనించే సూర్యుడు మార్చ్ 12-3-26 కొమరం భీం ఆశిర్వాద్ దిష్టి , జై నూర్ మండల్ రిపోర్టర్ వడ్డీ జనార్ధన్ వార్తా విశ్లేషణ ::ఈ రోజు సర్పంచ్ శ్రీమతి ఖందారే లక్ష్మి ఆధ్వర్యంలో పదవ తరగతి బాలికలందరికీ ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్ పెన్సిల్స్ వాటర్ బాటిల్స్ అందించడం జరిగింది.అందరూ కూడా పరీక్షల గురించి ఎటువంటి ఆందోళన చెందకుండా దృడ సంకల్పంతో రాయాలని సర్పంచ్ గారు విద్యార్థులను ఉద్దేశించి చెప్పడం జరిగింది.ఇట్టి కార్యక్రమం లో పాట్నాపూర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పటేల్, పంచాయతీ కార్యదర్శి, పాఠశాల హెడ్ మాస్టర్ మరియు పాఠశాల అధ్యాపక బృందం పాల్గొనడం జరిగింది .