పయనించే సూర్యుడు న్యూస్ 12 అనంతపురం జిల్లా యాడికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ప్రెసిడెంట్ హాజీ మహమ్మద్ ముజాహిద్, నేషనల్ చైర్మన్ షోయబ్ యాడికి మండల కేంద్రానికి చెందిన షేక్ షేక్షావలిని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ తాడిపత్రి నియోజకవర్గ అధ్యక్షుడిగా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా షేక్ షేక్షావలి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు తాడిపత్రి నియోజకవర్గ అధ్యక్షునిగా పదవి ఇచ్చినందుకు ఎల్లప్పుడూ తాడిపత్రి నియోజకవర్గ ప్రజల ,మండలాల ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని కచ్చితంగా పరిష్కరించే విధంగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని షేక్షావలి తెలిపారు.