ఎక్సైజ్ స్టేషన్ నేలకొండపల్లి సిబ్బందికి రివార్డు

పయనించే సూర్యుడు న్యూస్ 12 మార్చి 2026 నేలకొండపల్లి మండల రిపోర్టర్ సామల రామకృష్ణ. ఈ సంవత్సరంలో అక్రమ మద్యం మరియు ఇతర ఎక్సైజ్ నేరాల నియంత్రణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు నేలకొండపల్లి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బందికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్ అవాజ్ ఖాసీం, ఐపీఎస్ రూ. 8,000/- నగదు రివార్డు ప్రకటించి అభినందించారు. రివార్డు అందుకున్న వారిలో సుంకరి రమేష్, సీఐ, లత, ఎస్సై మరియు సిబ్బంది పి. శ్రీనివాస్ (P&HC) వి. వెంకటేశ్వర్లు (EC) ఎస్. బలరాం (EC) జె. రామారావు (EC) ఉన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ గణేష్ జిల్లా ఎక్సైజ్ అధికారి నాగేందర్ రెడ్డి రివార్డు అందుకున్న అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు. ఈ సంవత్సరం నేలకొండపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: మొత్తం కేసులు: 28 మొత్తం వ్యక్తులు: 29 జప్తు చేసిన ఆస్తి వివరాలు: 36.5 లీటర్లు ఐడి లిక్కర్340 లీటర్లు ఎఫ్‌జె వాష్22,570 కిలోల నల్ల బెల్లం245 కిలోల పటిక 190.35 లీటర్లు ఐఎంఎల్ 56.35 లీటర్లు బీరు ఇతర చర్యలు: 08 వాహనాలు స్వాధీనం 03 వ్యక్తులపై బైండోవర్ 02 ఉల్లంఘన కేసులు నమోదురూ. 30,000/- ఉల్లంఘన జరిమానా వసూలు అక్రమ మద్యం తయారీ, రవాణా మరియు విక్రయాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఎక్సైజ్ స్టేషన్ నేలకొండపల్లి అధికారులు మరియు సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *