పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ మర్చి 12 పోలవరం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం నాడు ఎటపాక మండలానికి విచ్చేసిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ళ బొజ్జి రెడ్డి కి ఏటిఏ నాయకులు ముందుగా శాలువాతో సన్మానించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగ సమస్యల పైన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కనితి శేఖర్ మరియు ఏటిఏ ఎటపాక బృందం ఆధ్వర్యంలో అనేక సమస్యలతో కూడిన వినతి పత్రం ఆయనకు అందజేయడం జరిగింది వినతి పత్రంలో పొందుపరిచిన అంశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జి రెడ్డి కి వివరిస్తూ ఏజెన్సీ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్డ్ కు అనుగుణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏజెన్సీ ప్రాంత వాసులకే చెందేలా కృషి చేయాలని ఉద్యోగ నియామకాల చట్టం రూపకల్పన కొరకు కృషి చేయాలని వారిని కోరడం జరిగింది అంతేకాకుండా మెగాడిఎస్సి 2025 ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయ నియామకాలు పొందిన గిరిజనేతర ఉపాధ్యాయులను మైదాన ప్రాంతంలోకి బదిలీ చేయించే విధంగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి తద్వారా ఏజెన్సీ నిరుద్యోగులకు తగు న్యాయం చేయాలని వారికి వివరించడం జరిగింది ప్రతి గిరిజన సంక్షేమ పాఠశాలలో ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేసి విద్యార్థుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని వారిని కోరడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కణితి రామకృష్ణ ,జిల్లా నాయకులు మానే ప్రవీణ్ మండల గౌరవ అధ్యక్షులు సోడె దారోగి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాక రాజు, అపక నాగేశ్వరరావు, పండ కిరణ్ ,పోడియం రాకేష్, మడకం రాంబాబు, పాయల తులసి, గొంది లక్ష్మి, కుర్సం కవిత, విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు