కల్దుర్కి గ్రామంలో చెట్ల నరికివేతపై గ్రామస్తుల ఆగ్రహం.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 12 బోధన్ : బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఉన్న చెట్లను నరికివేయడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎన్నాళ్లుగానో నీడనిచ్చే చెట్లను నరికివేయడం సరికాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలోని యువత ఈ విషయంపై ఫారెస్ట్ రేంజ్ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పంచాయతీ కార్యాలయం ముందు ఉన్న చెట్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవని, వాటిని నరికివేయడం వల్ల గ్రామస్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెబుతున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెట్ల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.