కష్టజీవుల జెండా ఏఐటీయూసీ.

★ ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షుడు వైటి భీమేష్ ఆధ్వర్యంలో 21వ మహాసభలు.

పయనించే సూర్యుడు మార్చి 12 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. ఆదోని ఏఐటియుసి పట్టణ 21 మహాసభ పట్టణ అధ్యక్షులు వైటి భీమేష్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా స్థానిక మున్సిపల్ గ్రౌండ్ నుండి మంగళాంజనేయ గుడి వరకు కార్మికుల ప్రదర్శన నిర్వహించి మహాసభల జెండాను ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే అజయ్ బాబు ఎగరవేసి సభను ప్రారంభించడం జరిగింది. ఈ మహా సభకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ము నెప్ప జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎన్. కృష్ణయ్య సిపిజి జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ పట్టణ కార్యదర్శి వీరేష్ కల్లుబాయి, పట్టణ కార్యదర్శి బి.వెంకన్న రాజు హాజరై ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మునియప్ప మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశ స్వతంత్రం కోసం పోరాటాలు చేసిన చరిత్ర కలిగిన జాతీయ కార్మిక సంఘం వారు కొనియాడారు. శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని శ్రమ దోపిడీ లేని సమ సమాజం శ్రామిక రాజ్యం రావాలని లక్షలతో దేశ కార్మిక వర్గానికి యూనియన్లు పెట్టి కార్మిక హక్కుల కోసం అశేష త్యాగాలు చేసి యూనియన్లు ఏర్పాటు చేసేది మొదలుకొని సమ్మె హక్కు వరకు 44 కార్మిక చట్టాలను దేశ ఉద్యోగ కార్మిక కార్మికులకు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి కార్మిక సంఘం వారు తెలిపారు. నేను కేంద్రం ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాన్ని ఎండ కొడుతూ నాలుగు లేబర్ కూలర్ రద్దు చేయాలని 44 కార్మిక చట్టాలు అమలు చేయాలని ప్రభుత్వ రంగ సమస్యలను కొనసాగించాలని విశాఖకు ప్రైవేటీకరణను ఆపాలని అమాలి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని బోన నిర్మాణ సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరించి పెండింగ్లో ఉన్నటువంటి క్లీన్ లకు డబ్బులు చెల్లించాలని అన్నయ్యకు పోరాటాలు చేసినటువంటి ఏఐటీయూసీ కర్నూలు జిల్లా 21వ మాసభలు మార్చి 28 29వ తేదీల్లో ఆలూరు లో జరగనున్నాయని 28వ తేదీ ఆలూరు లో జరుగు వేలాదిమంది కార్మిక మహా ప్రదర్శనకు ఆదోని నుండి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కార్మికులు హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం ఆదోని పట్టణ ఏఐటీయూసీ 31 మందితో కన్వినింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆదోని పట్టణ కన్వీనర్ గా వైటి. భీమరాజు,కో కన్వీనర్లుగా ఓబి. నాగరాజు బి.ఎంకన్న కమిటీ సభ్యులుగా ఆటో యూనియన్ నుండి వీరేశు రామకృష్ణ,మున్సిపల్ సంఘం నుండి జాన్ బాబు జయరాజ్ షేక్ అన్న పెద్ద ఎల్లప్ప స్వామిదాస్ అంగన్వాడి సంఘం నుండి జానకి శారదమ్మ వీరమ్మ,ఫర్టిలైజర్ హమాలి కార్మిక సంఘం నుండి కల్లుబాయి నరసింహులు దేవా నాగ రాజు మార్కెట్ యార్డ్ హమాలి కార్మిక సంఘం నుండి బి. వెంకన్న, పెద్ద గుండప్ప, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నుండి నుండి భాస్కర్ వెంకట్ దశరథ్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నుండి లక్ష్మన్న ఉల్లిగప్ప భవన నిర్మాణ కార్మిక సంఘం నుండి లక్ష్మీనారాయణ రాముడు, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నుండి సోమన్న సేకమ్మ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి రమేష్ ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు రంజిత్ గౌడ్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. అభివందనములతో, వైటి భీమరాజు.