కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 12 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కేంద్రం నాలుగు లేబర్ కోడ్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేందుకు పావులు కదుపుతుందని కార్మికులకు నష్టంగా ఉన్న లేబర్ కోడ్ లను అమలు చేయబోమని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ కోరారు. బుధవారం సిఐటియు మండల కమిటీ సమావేశం కే భారతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ కార్మిక శాఖ యజమానుల శాఖగా కాకుండా కార్మికుల పక్షాన నిలిచే శాఖగా ఉండాలని అప్పుడే కార్మికులకు న్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటే కార్మికుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారవుతుందని అన్నారు. లేబర్ కోడ్ ల అమల వల్ల కార్మికుల హక్కులకు భంగం కలుగుతుందని శ్రమ దోపిడీ పెరుగుతుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనే లేబర్ కోడ్ లు అమలు చేయబోమని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తేనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కేసు పాక నరసింహారావు విష్ణుకుమారి ఏసు దేవి భూదెమ్మ తదితరులు పాల్గొన్నారు.