గాజులపల్లిలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం

★ "సర్పంచ్ పంజా స్వామి ఆధ్వర్యంలో 8వ విడత టీకాల శిబిరం "

పయనించే సూర్యుడు మార్చి 12 రాజేష్ దౌల్తాబాద్) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గాజులపల్లి గ్రామంలో పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణకు సంబంధించిన 8వ విడత ఉచిత టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పంజా స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని పశువులకు ఉచితంగా టీకాలు వేశారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ ఎండి షాదుల్ మాట్లాడుతూ పశువులను గాలికుంటు సహా వివిధ రకాల అంటువ్యాధుల నుంచి రక్షించడానికి రైతులు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. ముందస్తుగా టీకాలు వేయించడం ద్వారా పశువుల ఆరోగ్యం కాపాడడంతో పాటు రైతులకు ఆర్థిక నష్టం తప్పుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోతుగంటి కనుక రెడ్డి, గాడి సూరి, మహంకాళి బాబు, బోయిని దశరథ, మర్పాక నరసింహులు, మోతే కనకయ్య, మహంకాళి గంగులు, గొల్లపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై తమ పశువులకు టీకాలు వేయించుకున్నారు.