గురుకులలు, ఎస్టీ బాలికల హాస్టల్ లను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

★ జిల్లా కలెక్టర్ కలెక్టర్ బాధావత్ సంతోష్ కుమార్

పయనించే సూర్యుడు, మార్చి 12 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలోని గురుకులాలు, ఎస్టీ బాలికల హాస్టల్‌ లను ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేశారు. వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ వెల్దండ లో ఉన్న వసతి గృహాలలో నెలకొన్న పలు సమస్యలను ఉన్నాయని జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. వసతి గృహాలలో ఉన్న సమస్యల సమాచారంపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే మండల గిరిజన గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్టల్‌లోనీ విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, తాగునీరు, ఆహారం, పరిశుభ్రత, వసతి తదితర సమస్యలను తెలుసుకొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టల్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వసతి గృహాలలో ఉన్న విద్యార్థినుల సంక్షేమం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినచో తర్వాత కట్టిన పరిష్కారం ఉంటుందని హెచ్చరించారు. హాస్టల్‌లో ఉన్న లోపాలను వెంటనే సరిచేసి విద్యార్థినులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, తహసిల్దార్, ఎంఈఓ, ఎంపీడీవో, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ నాయకులు పాల్గొన్నారు.