గోనెగండ్ల లో వైసీపీ పార్టీ సంస్థ గత పై నేతలు భేటీ, రాజకీయ పరిస్థితులపై చర్చ

★ 2029ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని దిశా నిర్దేశ చేసిన సుభాష్ చంద్రబోస్

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 12, 2026 గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ మండల కేంద్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వాల్మీకి నాగేష్ నాయుడు నివాసంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన మద్దూర్ సుభాష్ చంద్రబోస్ ని శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వాల్మీకి నాగేష్ నాయుడు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉందని, బీసీ వర్గాల ఐక్యతతో పార్టీ మరింత బలపడుతుందని తెలిపారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో 2029 ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పార్టీ విజయానికి బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరిశీలకులు మద్దూర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. పార్టీ కార్యకర్తలందరితో సమన్వయం చేసుకొని 2029 ఎన్నికల్లో ఎమ్మిగనూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు. తమ కార్యక్రమాలకు నాయకులు, కార్యకర్తల సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే పార్టీ ద్వారా ఇప్పటికే కొన్ని పదవులు పొందిన నాయకులకు సంబంధించిన కార్డుల విషయంలో కొంత గందరగోళ పరిస్థితి ఉన్నదని, చాలా మంది కార్యకర్తలు తమకు కార్డులు అందలేదని బాధపడుతున్నారని నాయకులు ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని చంద్రబోస్ ను కోరారు. పార్టీ ఇచ్చిన పదవులకు సంబంధించిన కార్డులు ఇవ్వకుండా అడ్డంకులు కల్పించడం తగదని, అవసరమైతే ఈ విషయంపై పార్టీ అధినేతను కలిసి ఫిర్యాదు చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోనెగండ్ల మండల ఉపాధ్యక్షులు పేట అల్లబకాష్ , మండల ప్రధాన కార్యదర్శులు లింగన్న, బి. శీను, పార్టీ నాయకులు హుస్సేన్, అల్లబండ గౌస్, పెయింటర్ రెహమాన్, కారుమంచి చాంద్, షాషా, కే. హరి , చంద్రశేఖర్ , అలీ బహుదూర్, భారతం నజీర్ , మాల చిన్న స్వామి, కంపల మునిస్వామి, గిరిని ఓబులేష్,తదితరులు పాల్గొన్నారు.