చెత్త సేకరించే సిబ్బంది గురించి పట్టణ పరిపాలన ముఖ్య కార్యనిర్వహణ అధికారి (మున్సిపల్ కమిషనర్) తనిఖీ

పయనించే సూర్యుడు; తేదీ 12 గురువారం, మార్చి 2026 పాత్రికేయులు, ఆడెపు సంతోష్ కుమార్; మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చింతల్ సర్కిల్లో హైదరాబాద్ పట్టణ పరిపాలన ముఖ్య కార్యనిర్వహణ అధికారి(మున్సిపల్ కమిషనర్) సృజన అధికారులతో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి విషయంలో.. ప్రజల ఇబ్బందులను తెలుసుకొని..సిబ్బందికి పూర్తిస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. వ్యాపార సముదాయాలు చెత్త విషయంలో జాగ్రత్త తీసుకోవాలని, తడి పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు. చెత్త తీసుకెళ్లే ప్రాంతాల్లో.. ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలని కమిషనర్ సృజన చెత్త సేకరణ సిబ్బందికి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *