చెస్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో చెస్ బోర్డుల పంపిణీ

పయనించే సూర్యుడు 12-3-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని మల్లన్న పేట గ్రామంలో గ్రేటర్ అట్లంట తెలంగాణ సొసైటీ అధ్యక్షులు గండ్ర వెంకటరమణారావు సహకారంతో గొల్లపల్లి మండల పరిధిలోని జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ 44 పాఠశాలకు 115 చెస్ బోర్డులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లన్న పేటలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చెస్ నెట్ వర్క్ ఫౌండర్ కొండాటి సుధీర్ మాట్లాడుతూ చేసి గేమ్ వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి పెరుగుతుందని అదేవిధంగా ఆలోచనశక్తి సమస్య పరిష్కారం నైపుణ్యాలు పెరుగుతాయని వారన్నారు ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనందరావు యాల్ల అమర్నాథ్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వుటూరి మహేష్ పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వేణుగోపాలరావు కమిటీ సభ్యులు సురేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.