పయనించే సూర్యుడు మార్చి 12, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). జగన్నాధపురం గ్రామంలోని రైతు వేదికలో ఈరోజు వివిధ పంటల సాగు పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంటల నిర్వహణ, దిగుబడి పెంపు విధానాలు, కొత్త సాగు సాంకేతికతలపై వివరించారు. సదస్సు అనంతరం రైతులు కలిసి రైతు వేదికలో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మొక్కజొన్న పంట కోతకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. అలాగే మొక్కజొన్నకు కనీస మద్దతు ధరగా క్వింటాల్‌కు రూ.2400 చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా రైతులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏవో మేడం గారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో తిమ్మినేనిపాలెం, జగన్నాధపురం, తిరుమలపురం, బస్వాపురం, పందిళ్ళపల్లి, మత్కేపల్లి గ్రామాలకు చెందిన రైతులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.