పయనించే సూర్యుడు మార్చి 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో జరగబోయే జనగణన కార్యక్రమంలో పి.ఎస్.హెచ్.ఎం లకు కూడా పర్యవేక్షకులుగా అవకాశం కల్పించాలని కోరుతూ బిజినపల్లి పి.ఎస్.హెచ్.ఎం ల తరపున డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పి.ఎస్.హెచ్.ఎం లు మాట్లాడుతూ జనగణన కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనదని, గ్రామాల పరిస్థితులు, ప్రజల వివరాల సేకరణలో తాము అనుభవం కలిగి ఉన్నామని తెలిపారు. అందువల్ల తమకు కూడా పర్యవేక్షకులుగా అవకాశం కల్పిస్తే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరిస్తామని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పి.ఎస్.హెచ్.ఎం లు వకుళ, వెంకటలక్ష్మి, యశోద, శ్రీనివాసరెడ్డి, గణేష్, ఆనంద్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.