పయనించే సూర్యుడు రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ తే. 12-03-2026 దిన చీడికాడ మండలం బైలపూడి సింగవరం గ్రామంలో ఉదయం 9 గంటలకు గొర్రెలు మరియు మేకలకు జరుగుతున్న చీడ పారుడు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమo ఈరోజు జరిగింది. శ్రీకృష్ణ గొర్రెలు మేకల యువజన సంఘం ప్రెసిడెంట్ చొప్ప శ్రీను టీకాలు ప్రారంభించారు. అనంతరం పశుసంవర్ధక సహాయకులు మోర్తా శ్రీనివాసరావు మాట్లాడుతూ,ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 వ తేదీ వరకు గొర్రెలు మరియు మేకలకు జరుగుతున్న చీడ పారుడు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం గురించి మండలంలోని అన్నీ రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్న గొర్రెలు, మేకల పెంపకం దారులకు అవగాహన కల్పించి ఈ అవకాశాన్ని వినియోగించుకోనెలా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఊరీకుటి అప్పలకొండ, చొప్ప నారాయణరావు, గొకవాడ నల్లమారి శ్రీను,చప్ప నాగలక్ష్మి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.