డ్రైనేజీ మరమ్మత్తు పనులను వేగవంతంగా చేయాలి..

★ పనులను పరిశీలించిన తల్లాడ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ లక్ష్మారెడ్డి..

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 12, తల్లాడ రిపోర్టర్ తల్లాడ రింగ్ రోడ్డు లోని డ్రైనేజీ మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు సూచించారు. బుధవారం పనులు జరుగుతున్న ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు జరుగుతున్న నేపథ్యంలో పనులను శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా శాశ్వతంగా నీరు వెళ్లే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి, వార్డు మెంబర్ సరికొండ శ్రీనివాసరాజు ఉన్నారు