తూరంగి లో తెలంగాణ రెడ్డి పెత్తనం ఏంటి

★ అక్రమలేఅవుట్ .అధికారుల ఆదేశాలు భేఖాతరు ★ ప్రభుత్వ భూములను కాపాడాలంటూ పి జి ఆర్ ఎస్ లో ఫిర్యాదు..

పయనించే సూర్యుడు మార్చి 12, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ జిల్లా.కాకినాడరూరల్, తూరంగి గ్రామంలో తెలంగాణ రెడ్డి పెత్తనం ఏంటి అని అతనికి కొమ్ము కాస్తున్న వారు ఎవరని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కి గండి కొడుతున్న తెలంగాణ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెడ్డి ఇక్కడ పెత్తనం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.. వివరాల్లోకెళ్తే.. స్టేట్ మారినా అతని జులుం మాత్రం తగ్గలేదు. అధికారుల ఆదేశాలతో ఆతనికి పని ఉండదు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ లేఅవుట్లు వేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంటారు. కాకినాడరూరల్ మండలం తూరంగి గ్రామంలో సర్వే నెంబర్ 53లో ఎటువంటి అనుమతులు లేకుండా 4ఎకరాల్లో లేఅవుట్ వేయడం జరుగుతుంది. హైవేకు కూత వేటు దూరంలో ఈ తంతు జరుగుతున్నా ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా గ్రావెల్‌ను తీసుకొచ్చి భూమిని చదును చేస్తున్నారు. దీనిపై ఆరా తీస్తే ఆ లేఅవుట్‌ను తెంగాణా రెడ్డి అనే వ్యక్తి వేస్తున్నారని తెలిసింది. అనుమతులు లేనందున లేఅవుట్ పనులు ఆపాల్సిందిగా గ్రామ కార్యదర్శి నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా పనులు చేస్తూనే ఉన్నారు. అంతే కాకుండా ఆ స్థలంలో 70అడుగుల పుంత ఉంది. దీనిని కూడా ఆక్రమించి గ్రావెల్‌తో చదును చేయడం జరిగింది. ఈ స్థలాన్ని సర్వేయర్ కొలిచి కర్రలు పాతడం జరిగింది. అయినా దానిని దాటి ప్రహారి నిర్మించడం జరిగింది. దీనిపై రెవెన్యూ సిబ్బంది అడిగితే కన్వర్షన్ తీసివేయడం జరిగిందని, మీకు సంబందం లేదని దురుసుగా సమాధానం చెప్పడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా తెలంగాణా రెడ్డి ప్రవర్తన ఇలానే ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారిని అడ్డం పెట్టుకుని దర్జాగా అక్రమ లేఅవుట్లు వేయడం ఈయన ప్రత్యేకత. దీంతో ఏ అధికారి వచ్చినా వారి ఆదేశాలు లెక్క చేయకుండా పనులు చేసుకుపోతుంటారు. ఈ అక్రమ లేఅవుట్‌ను ఆపి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కలెక్టర్‌కు పిజిఆరఎస్‌లో పిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ లేఅవుట్‌కు చెక్ చెప్పి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.