పయనించే సూర్యుడు : మార్చి 12 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణ మర్చి 12- 3 -2026 నాడు మధ్యాహ్నము 3:00 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ నూతనంగా ఎన్నుకోబడిన మనుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రాష్ట్ర టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షునిగా నియమించబడిన సందర్భంగా ప్రమాణస్వీకారం గాంధీ భవన్ దగ్గర నిర్వహించబడును ఇట్టి కార్యక్రమానికి మండల స్థాయి నుంచి ప్రత్యేక మండలాధ్యక్షుడు పాల్గొనాలని పత్రికా ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది అరేళ్ళ యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రమ్ రేపు జరగబోయే రాష్ట్ర బడ్జెట్లో దళితులకు ప్రత్యేక స్థానాన్ని కల్పించి వారి సంక్షేమానికి వారి అభివృద్ధికి ప్రత్యేక పథకాలను నిర్వహించాలని మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ సంక్షేమ హాస్టల్లో మరి ఎస్సీ గురుకులాలకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని మరియు హాస్టల్స్ లో గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కొరకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క అసెంబ్లీకి ఒక ఎస్సీ స్టడీ సర్కిల్ సెంటర్ ను తెరవాలని మరియు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ ఎలక్షన్లు కౌన్సిలర్ ఎలక్షన్స్ కార్పొరేట్ ఎలక్షన్లో జరిగిన గ్రామాలలో వార్డులలో కార్పొరేటర్ ఏరియాలలో ఎస్సీలకు సంబంధించిన రిజర్వేడు గ్రామాలలో వారికి ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి
ఎస్సి గ్రామాలలో మౌలిక సదుపాయాలను ఎస్సీ వాడలలో కల్పించాలని కోరుతూ ఆ ప్రత్యేక రిజర్వేషన్ స్థానాలకు ప్రత్యేకంగా బడ్జెట్ నిర్వహించాలని మరియు జనరల్ స్థానాల్లో కూడా ఎస్సీలుగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల ఏరియాలో వారికి కూడా ప్రత్యేక బడ్జెట్లు నిర్వహించి ఎస్సీలు కూడా జనరల్ స్థానాల్లో అభివృద్ధి పథకాలు చేస్తారు అని తెలుపుతూ ఒక నమ్మకాన్ని కల్పించే ఉద్దేశంతో రాబోయే బడ్జెట్లో ఎస్సీలకు సంబంధించిన బడ్జెట్లో కేటాయించాలి చట్టబద్ధత కూడిన ఎస్సి సబ్ ప్లాన్ నిధులని ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గానికి 200కోట్లను కేటాయించాలని అంటే 25 వేల కోట్ల బడ్జెట్ తో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఈ బడ్జెట్లో కేటాయించాలని కోరుతున్నాము అని బాలానగర్ మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ విభాగం నాయకులు అరేళ్ళ యాదయ్య తెలియజేశారు