దేవాలయ అభివృద్ధి కోసం పనిచేయాలి : ఎమ్మెల్యే డా.పార్థసారథి

పయనించే సూర్యుడు మార్చి 12 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. కర్నూలు జిల్లా మంత్రాలయం అసెంబ్లీలోని ఉరుకుంద ఈరన్న స్వామి పాలక మండలి సభ్యులు రంగస్వామి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాయి బ్రాహ్మణ కుల సంఘ పెద్దలతో కలిసి డా . పీవీ.పార్థసారధి ని సన్మానించి మర్యాదపూర్వకంగా కలిశారు, ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధితోపాటు నాయి బ్రాహ్మణ కుల సంఘ సమస్యలు పరిష్కార దిశగా పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కుల సంఘ అధ్యక్షులు ఈరన్న గౌడ్, మునిస్వామి, కృష్ణ, సత్య నారాయణ, నాగరాజ్, పసుపుల శ్రీనివాస్, వీరస్వామి, వీరేశ్, అంజయ్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు