నాగనాథహళ్లి గ్రామం లో ఆధ్యాత్మిక కార్యక్రమం.

* పాల్గొన్న కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ.

పయనించే సూర్యుడు మార్చి 12 కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్. నాగనాతహళ్లి గ్రామంలో నిర్వహించిన కొల్లాపురమ్మ అవ్వ దేవర మరియు వాల్మీకి నగర్‌లో జరిగిన పెద్దమ్మ అవ్వ దేవర కార్యక్రమాల్లో గ్రామంలోని టిడిపి నాయకులు, పెద్దల ఆహ్వానం మేరకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. గ్రామ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక సంస్కృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మదిలే భాస్కర్ రెడ్డి, రామచంద్ర, గోపాల్ రెడ్డి, రామకృష్ణ, ఓంకార్, రాజశేఖర్, రాఘవరెడ్డి, వీరేష్, చిన్న చిట్టి, కృష్ణ మరియు టిడిపి నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *