నారాయణ పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనే కార్యక్రమం.

పయనించే సూర్యుడు మార్చి 12 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. ఆదోని నారయణ పాఠశాలలో ఈ రోజు జరిగిన "స్టూడెంట్ లేడ్ కాన్ఫరెన్స్( విద్యార్థుల నేత్రుత్వం లోని సమావేశాలు)"యూకేజీ తరగతి విద్యార్థులు తమ నైపుణ్యలను ప్రదర్శించడం జరిగినది ఈ కార్యక్రమము ఈ రోజు మొదటి రోజు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఒకటవ తరగతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు ముఖ్య అతిథులుగా ఏజీఎం రమేష్ మరియు ఈ కిడ్స్ కోఆర్డినేటర్ జైబావిచ్చేసారు. కార్యక్రమానికి ఆదోని నారాయణ ప్రిన్సిపల్ లక్ష్మీ రెడ్డి అధ్యక్ష తన వహిస్తూ ఒక్కొక్క విద్యార్థి తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడమే ఈ యొక్క కార్యక్రమము ముఖ్య ఉద్దేశం అని తెలిపారు మరియు రేపటి దినము అనగా 12-03-26 కూడా ఎల్ కె జి మరియు 13-03-26 న నర్సరీ తరగతి విద్యార్థులకు స్టూడెంట్ లేడ్ కాన్ఫరెన్స్ (ఎస్ ఎల్ సి) కార్యక్రమం కొనసాగుతుంది అని అన్నారు . తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ముందు మాట్లాడటం ద్వారా విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారని ఈ కిడ్స్ కోఆర్డినేట్ జైబా తెలిపారు. ఎస్ ఎల్ సి లు విద్యార్థులను సాధారణ పాఠ్యపుస్తకాలకు మించి ఆలోచించమనిప్రోత్సహిస్తాయి అందువల్ల, విద్యార్థులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని, దానిని తమకు నచ్చిన సృజనాత్మక రీతిలో ప్రదర్శిస్తారని ఏజిమ్ రమేష్ తెలిపారు రు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయని ఉపాధ్యాయులందరూ పాల్గొనడం జరిగినది.