నాలుగు లేబర్ కోడుల రద్దుకై కలెక్టర్ కార్యాలయం వద్ద మార్చి 16 న ధర్నా

★ కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి ★ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకన్న పిలుపు

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,సెంటినరీ కాలనీ -12 ఆర్జీ 3 ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ కమ్యూనిటీ హాల్ హౌస్ కీపింగ్ గెస్ట్ హౌస్ కార్మికుల సెక్షన్ లో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టీ యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న సమావేశాలు నిర్వహించి ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లేబర్ కోడ్స్ రద్దుకై మార్చి 16 న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా మార్చి 23 హైదరాబాద్ ఆర్ ఎల్ సి ఆఫీసు వద్ద జరుగు మహా ధర్నా జయప్రదం చేయాలని అన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి నాలుగు లేబర్ కోడుల బిజెపి ప్రభుత్వం చేయబోతుందని మోదీ ప్రభుత్వం తెచ్చిన ఈ ప్రమాదకర నాలుగు లేబర్ కోడుల రద్దుకై నిరంతర పోరాటానికి సిద్ధం కావాలని ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర పిలుపు లో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మార్చి 16న జరిగే మహాధర్నా ను అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ జీ 3.డివిజన్ నాయకులు ఎం లక్ష్మి, ఎస్ ఓదమ్మ ,ఆర్ రాధ, కే లక్ష్మి ,సదానందం, రమేష్, వెంకటేష్ ,రవి, సత్తయ్య, లక్ష్మి, శ్రీనివాస్, వెంకటేష్ ,నగేష్, రాజలక్ష్మి,శాంతమ్మ ,పద్మ ,విజయ, సరోజన, కనగలక్ష్మి ,స్వప్న, రాజేశ్వరి,తదితరులు పాల్గొన్నారు.