పయనించే సూర్యుడు ,మార్చి 12,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ బూర్గుంపాడు, భద్రాచలం,సారపాక పరిధిలో ఉన్న విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన,నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యమని టీజీ ఎన్పీడీసీఎల్ ఫోరం చైర్మన్ వేణుగోపాలచారి అన్నారు. వినియోగదారుల సమస్యల పరిష్కా రానికి తాళ్ల గొమ్మూరు ప్రాంతం లో రైతు వేదిక లో బుధవారం ఏర్పాటు చేసిన 'లోకల్ కోర్టు'లో ఆయన మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సాంకేతిక లోపా లను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ, మెరుగైన సేవ లు అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని వెల్లడిం చారు. విద్యుత్ నాణ్యత పెంపుతో వ్యవసాయ, పారిశ్రామిక, గృహావసరాలకు మెరుగైన సరఫరా అందుతుందని చెప్పారు. వినియోగదారులకు ఏమైనా సమస్యలు ఎదురైతే నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా ఫోరం దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ప్రతీ సమస్యనూ పారదర్శకంగా పరిష్కరించడమే ఫోరం బాధ్యతని స్పష్టం చేశారు. అనంతరం ఇంటి మీటర్ పేర్లు మార్పులు, గృహల మీద ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని వినతులు అందజేయగా,అర్జీ పెట్టుకున్న వారికీ డిమాండ్ నోటీసులు అందించమని సూచించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ టెక్నికల్ మెంబర్ రమేష్, ఇండిపెండెంట్ మెంబర్ రామారావు, ఎస్ఏఓ శ్రీధర్, డీఈ జీవన్కుమార్, ఏడీఎంల్ నరసింహారావు , ఏఈ ఉపేందర్, ఏఏఓ సత్యనారాయణ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
