నేడు భీముని కుంట చెరువు అలుగును పీఎస్ సి చైర్మన్ అరికెపూడి గాంధీతో కలిసి మాజీ కార్పొరేటర్నార్నె శ్రీనివాసరావు పరిశీలించారు

పయనించే సూర్యుడు, మార్చి 12 రంగారెడ్డిజిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) ఈ సందర్భంగా పీఎసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు భీముని కుంట చెరువు ను పరిశీలించడం జరిగినది అని,చెరు వు ను త్వరలోనే సుందర శోభితవనం గా తీర్చిదిద్దుతామని,భీముని కుంట చెరువు ఇన్ లెట్ మరియు ఔట్ లెట్ స్ధితిగతులను పరిశీలించడం జరిగినది అని, భీమునికుంట చెరువు అలుగును పరిశీలించి,అలుగు వద్ద చెత్త, చెదారం పెరుకుపోవడం వలన నీటి ప్రవాహం సాఫీగా సాగక, మురుగు నీటి వ్యవస్థ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని,అలుగు వద్ద పెరుకపోయిన చెత్త చెదారం ను వెంటనే జేసీబీ సహాయంతో అలుగు వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం జరుగుతుంది అని,పను లు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులకు లేకుండా చూడాలని,నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసు కోవాలని పీఏసీ‌చైర్మన్ గాంధీ అధికా రులకు తెలియచేసారు. చెరువులో మురుగు నీరు కలవకుండా చూడలని చెరువు చుట్టూ మురుగు నీటిని మళ్లించేలా యు జి డి పైప్ లైన్ ద్వారా చేపట్టాలని అవసరమైన చోట మ్యాన్ హోల్ లను పునరుద్ధరించాలని, మ్యాన్ హోల్ లలో పేరుకుపోయిన చెత్త చెదారం ను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని,చెరువును త్వరలోనే సుందర శోభిత వనంగా తీర్చిదిద్దుతామని,చుట్టూపక్కల కాలనీల వాసులకు ప్రజలకు చక్కటి ఆహ్లదకరమైన వాతావరణం కల్పిస్తా మని పీఏసీ చైర్మన్ గాంధీ తెలియ చేసారు అదేవిధంగా కాలనీల అభివృద్ధి కి కృషి చేస్తానని కాలనీ అన్ని రంగాలలో అభివృ ద్ధి చేస్తానని, కాలనీ వాసుల విజ్ఞప్తి మెర కు డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కా రం చూపుతామని త్వరలోనే పనులు ప్రారంభించి కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా మని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసు కువస్తే తప్పకుండా పరిష్కరి
స్తానని,ఎల్లవేళలా మీకు అందుబా టులో ఉంటానన్న పిఎసి చైర్మన్ గాంధీ. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు డి ఈ నరేందర్, ఏ.ఈ సర్వేశ్, జలమం డలి అధికారులు డీజీఎం శ్రీనివాసరా జు,మేనేజర్ విలియం ప్రకాష్,జిహెచ్ ఎంసి అధికారులు డీఈ మౌనిక, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్ నాయకులు,కార్య కర్తలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.