పదవ తరగతి పరీక్షలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

* విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి‌ * కొడవటూరు సర్పంచ్ నీల కవితా మురళి.

పయనించే సూర్యుడు, మార్చ్ 12, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. మండలంలోని కొడవటూరు గ్రామంలో బుధవారం రోజున జడ్పీహెచ్ఎస్ పాఠశాల యందు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సు (మోటివేషనల్) క్లాసులు జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయుడు నరసింహ స్వామి అధ్యక్షత వహించగా గ్రామ సర్పంచ్ నీల కవిత మురళి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలలో స్కూల్ టాపర్ కి 2000 రూపాయలు మండల టాపరికి 5000 రూపాయలు జిల్లా టాపర్ కి 10000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని (కొడవటూరు గ్రామ విద్యార్థులకు మాత్రమే నని) ప్రకటించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు కోరారు. మంచి రిజల్ట్స్ సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మంచి పౌరులుగా ఎదగాలని కోరారు. గుడాల చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర ప్రతినిధి సంతోష్ మరియు ప్రముఖ గైనకాలజిస్ట్ దయాల్ ఈ సమావేశానికి విచ్చేసి విద్యార్థులకు మోటివేషనల్ క్లాస్ తో పాటు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష ప్యాడులను బహుకరించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి ఏఏపిసి చైర్మన్ కొత్త పల్లి అంజమ్మ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని , పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు యాదగిరి, ఎస్ కిషన్, మహమ్మద్ అoకుషావలి , వి. రఘుమూర్తి, ఏ. ప్రభాకర్ మరియు సిద్ధులు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *