పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ ఆశీస్సులు పంచసోపానాల కరపత్రాలు అందజేత…

* ఇటిక్యాల లో ఘనంగా పదవ తరగతి వీడ్కోలు సమావేశం... * ఆత్మ జిల్లా అధ్యక్షులు, ఎఎపిసి చైర్మన్, మహిళా ఉపాధ్యాయిని లకు ఘన సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 12 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా, ఇటిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా ఫేర్‌వెల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జయీభవ విజయీభవ 2.0” కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఐఎఎస్ అందించిన ఆశీస్సులు, పదవ తరగతి పరీక్షల్లో విజయం సాధించేందుకు సూచించిన పంచసోపానాల కరపత్రాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీమవదారి సదాశివ్, ఆత్మ జగిత్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీపీ కాటిపెల్లి గంగారెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ తాలుక లావణ్య, ఉపసర్పంచ్ నాగిరెడ్డి సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ సామల్ల వేణు లావణ్య విద్యార్థులకు కలెక్టర్ సందేశాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు స్పష్టమైన ప్రణాళికతో, క్రమశిక్షణతో చదివి వార్షిక పరీక్షల్లో శతశాతం ఫలితాలు సాధించాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ మంచి లక్ష్యంతో కృషి చేస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఇదే రోజు జగిత్యాల జిల్లా అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఆత్మ) చైర్మన్ గా ఎన్నికైన మాజీ ఎంపీపీ కాటిపెల్లి గంగారెడ్డిని ఘనంగా సన్మానించారు. అలాగే ఇటీవల నిర్వహించిన మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ తాలుక లావణ్య, మహిళా ఉపాధ్యాయినులు, కరాటే మేడమ్‌లను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యుపిపి జిల్లా అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, గాజంగి రాజేశం, రమేష్ రెడ్డి, హన్మంతరావు, జియావుద్దీన్, ముజాహిద్, స్వర్ణలత, శ్రీలత, నీరజ, నాగలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *