పేదవారిపై దౌర్జన్యం ..ఇల్లు ఖాళీ చేయమంటూ బెదిరించి రౌడీయిజం..

పయనించే సూర్యుడు మార్చి 12, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) సర్పవరం గ్రామంలో పినుగుల పుంతలో సుమారు 75 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న వారిపై దౌర్జన్యంగా పొక్కులేని తెచ్చి ఖాళీ చేయాలంటూ ఇబ్బందులు గురి చేస్తున్నారని బాధితులు బోనాస్ కృష్ణ అన్నయ్య బోనస్ సత్తిబాబులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 75 సంవత్సరాలుగా మా తాతల నుండి ఇక్కడే నివాసం ఉంటూ కాలం సాగిస్తున్నామని అయితే రౌడీ మూక బుధవారం రెండు ట్రాక్టర్లు ఒక పొక్లేను తో వచ్చి ఖాళీ చేస్తారా చేయరా అంటూ జులూమ్ ప్రదర్శించి చుట్టూ ఉన్న కంచెను తొలగించి కొట్టడానికి వచ్చారని బాధితులు తెలిపారు. పినుగుల పుంత సంబంధించిన నాలుగు ఎకరాల 60 సెంట్లు భూమిలో పెద్దపెద్ద ఇల్లు నిర్మాణం చేసి ఎన్నో ఏళ్ల బట్టి అందరూ నివాసం ఉన్నారని కూలి పని చేసుకుని బతికే మమ్మును ఫేక్ డాక్యుమెంట్స్ తెచ్చి బెదిరిస్తున్నారు అంటూ వాపోయారు. అయితే హైకోర్టులో పిటిషన్ కూడా ఉందని అయినా సరే లెక్కచేయకుండా రౌడీలు వచ్చి ఇబ్బందులు గురి చేస్తున్నారని మాకు న్యాయం చేయాలని మీడియాకు తెలియజేశారు. ఇంటి పన్ను కరెంట్ బిల్లు కూడా ఉందని ఈ మధ్యకాలంలో తాటికు ఇల్లు అని పన్ను కట్టించుకోలేదన్నారు. ఇప్పుడు 125 గజాలలో రేకుల షెడ్డు కూడా వేసుకున్నామని ఇదే ఇంటిలో నివాసం ఉంటున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *