భార్యను హతమార్చిన భర్త.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మార్చి.12.2016 పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, రంపచోడవరం మండలం దబ్బవలస గ్రామంలో 7వ తారీకు శనివారం నాడు బోదులూరు అబ్బాయి రెడ్డి(భర్త)అనే వ్యక్తి అతని భార్యను బోడులూరు రామలక్ష్మి అతి కిరాతకంగా ఊరి చివర జీడిమామిడి తోటలో అతికిరాంతకంగా కత్తితో నరికి చంపేశాడు. ఈ విషయం బుధవారం 11తారీఖు ఉదయం తెలియడం.ఆ ప్రాంతాన్ని ఎస్ఐ, సిఐ కానిస్టేబుల్స్ అక్కడికి చేరుకున్నారు. ఇదే విషయమై భారత్ ఆదివాసి పార్టీ బృందం ఒక ఆదివాసి మహిళ మృతి చెందడం. వల్ల భారత్ ఆదివాసి పార్టీ నాయకులు,కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. చూడలేని స్థితిలో మృతదేహం పురుగులు పట్టి ఉంది.ఇటువంటి అతి కిరాతకమైన తన భార్యను హతమార్చడం. వలన ఎటువంటి ఉపయోగాలు ఉండవు. ఏదైనా సమస్య ఉంటే పెద్దల సమక్షంలో లేదా పోలీస్ స్టేషన్లో వారి సమక్షంలో సమస్యను పరిష్కరించుకోవాలి. అంతేకానీ ఇంత అమానుష్యంగా తన భార్యను చంపడం. అనేది ఎంతో బాధాకరమైన విషయం ఇప్పుడు.ఆ చనిపోయిన బోదులూరు విజయలక్ష్మి ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి అతి చిన్న వయసులో తల్లితండ్రులు దూరమైతే ఆ పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ ఎవరు తీర్చలేనిది. ఆ బాధ ఎవరికి చెప్పలేనిది. ఈ సమాజంలో ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య తగాదాలు ఉంటే అది పెద్దల సమక్షంలోనూ లేదా పోలీస్ స్టేషన్, న్యాయస్థానము సమక్షంలోనూ పరిష్కరించుకోవాలి. తప్ప ఇంత నీచమైన అకృత్యాలను పాల్పడుతూ.అతి దారుణంగా హతమార్చడం అనేది ఒక మృగానికి మాత్రమే చెందుతుంద. అంతేగాని మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఇలాంటి నీచమైన పద్ధతులను విడనాడాలి. ఇంతటి ఆకృత్యమైన హేళన వ్యక్తిని ఈ మానవ మృగరానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టపరమైన చర్యలు తీసుకొని.అతను మానవ సమాజానికి కళంకం. బెయిల్ కూడా ఇవ్వకుండా తగు చర్యలు తీసుకోవాలని. చనిపోయినటువంటి బోదులూరు విజయలక్ష్మికి తల్లిదండ్రులకు గ్రామస్తులు మరియు భారత్ ఆదివాసి పార్టీ సభ్యులు అందరూ మరియు భారత్ ఆదివాసి పార్టీ పోలవరం జిల్లా ఇన్చార్జి మద్దిటీ అంజిరెడ్డి. పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. నష్టపోయిన ఆ పిల్లలకు,బోదులూరు రామలక్ష్మి, తల్లిదండ్రులకు తగు న్యాయం చేయవలసిందిగా. అధికారులను ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అంతేకాకుండా బోదులూరు అబ్బాయి రెడ్డి యొక్క స్థిరసరాస్తులను ఆ ముగ్గురు పిల్లలకు సెందే విధంగా ఆ పంచాయతీ గ్రామ పెద్దలు రెవిన్యూ డిపార్ట్మెంట్ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ మర్డర్ మిస్టరీ వెనుక ఇంకా వెనుక కనిపించని ఇంకో నాలుగు వ్యక్తులు ఉన్నారని చనిపోయిన ఒక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వారిపై కూడా తగు చర్యలు తీసుకోవలసినగా జీవితంలో ఏ వ్యక్తి అయినా సరే ఇలా హత్యలు చేస్తే మళ్లీ వాళ్ళు మానవ సమాజంలో తిరగడానికి అనర్హులుగా న్యాయస్థానం తగు చర్యలు తీసుకొని వాళ్లను కారాగారంలో జీవితాంతం ఉంచవలసిందిగా భారత్ ఆదివాసి పార్టీ ప్రభుత్వాన్ని డిపార్ట్మెంట్ ని కోరుకుంటుంది. ఈ కార్యక్రమంలో భారత్ ఆదివాసి పార్టీ నాయకులు జిల్లా,ఇంచార్జ్ మద్దిట్టి అంజిరెడ్డి రంపచోడవరం డివిజన్ అధ్యక్షులు పండా కృష్ణమూర్తి దొర మరియు జిల్లా యూత్ కన్వీనర్ నెక్కల శ్రీనివాసరావు మారేడుమిల్లి మండలం అధ్యక్షుడు చెదల వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనరు పాల్గొని ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *