మంత్రాలయం టీడీపీ ఇంచార్జిని కలిసిన పెద్దకడబూరు నూతన ఎస్సై మారుతి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 12 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డిని బుధవారం ఆయన స్వగృహంలో పెద్దకడబూరు నూతన ఎస్సై మారుతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై మారుతి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో మండలంలోని స్థానిక సమస్యలు, ప్రజా అభ్యర్థనలు, శాంతిభద్రతల పరిస్థితి, అభివృద్ధి అంశాలపై పరస్పరం చర్చించారు. ప్రజలకు భద్రత కల్పించడం, సమస్యలు త్వరితగతిన పరిష్కరించడం వంటి విషయాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రజలకు న్యాయం చేసే విధంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు సమగ్ర సేవలు అందేలా కృషి చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషించాలని తెలిపారు. మండలంలో ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో పోలీసులు ముందుండాలని ఆయన కోరారు. నూతన ఎస్సై మారుతికి బాధ్యతలు విజయవంతంగా నిర్వహించాలని శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *