మానకొండూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్య గమనిక:

పయనించే సూర్యుడు న్యూస్: మార్చి/12: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్: సాయిరెడ్డి బొల్లం: మానకొండూర్ నియోజకవర్గం మార్చి 12, 2026 న టీపీసీసీ ఎస్సీ విభాగ చైర్ పర్సన్ గా డా. కవ్వంపల్లి సత్యనారాయణ, పదవి స్వీకార మహోత్సవం జరుగుతున్న సందర్భంగా మానకొండూరు నియోజకవర్గం నుండి గాంధీభవన్ చేరుకొనుటకు ముందస్తు ఏర్పాట్లను గమనించవలసిందిగా కోరుచున్నాము. కార్ స్టిక్కర్లు మరియు బస్సు స్టిక్కర్లు మీ యొక్క మండల అధ్యక్షుల దగ్గర అందుబాటులో ఉంటాయి. అనగా మార్చి/ 12, 2026 ఉదయం 8:00 గంటలకు నియోజకవర్గం నుండి బయలుదేరి 12:00 గంటల వరకు గాంధీ భవన్ చేరుకోగలరు. మానకొండూర్ నియోజకవర్గం మరియు కరీంనగర్ జిల్లా నుండి వస్తున్న వెహికల్స్ పార్కింగ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడమైనది. గాంధీ భవన్ వద్ద భోజన ఏర్పాట్లు చేయబడినవి మీరు గాంధీ భవన్ చేరుకున్న వెంటనే భోజనం చేసి 1:30 గంటల వరకు అమరవీరుల స్థూపం వద్దకు చేరుకోగలరు. ఈ లోగా డా. కవ్వంపల్లి సత్యనారాయణ, హైదరాబాద్ లోకల్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మధ్యాహ్నం 1:00 గంటలకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి బైక్ ర్యాలీగా ట్యాంక్ బండ్ నుండి మొదలై నిజాం కాలేజీ సమీపంలో గల బాబూ జాగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి 1:45 గంటల వరకు అమరవీరుల స్థూపం చేరుకుంటారు కావున మీరందరూ 1:45 గంటల వరకు అమరవీరుల స్థూపం దగ్గర అందుబాటులో ఉండగలరు. మధ్యాహ్నం 1:45 గంటలకు కవ్వంపల్లి, అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరుల దివ్య స్మృతికి నివాళులు అర్పించిన అనంతరం కాలి నడకన గాంధీ భవన్ చేరుకుంటారు. అనంతరం 3 గంటలకు గాంధీభవన్ లో టీపీసీసీ ఎస్సి విభాగ చైర్ పర్సన్ గా డా. కవ్వంపల్లి సత్యనారాయణ పదవి స్వీకార మహోత్సవం జరుగును. కావున కార్యక్రమ ప్రణాళికను అనుసరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అడుగులు వేయాలని మనవి. ప్రయాణంలో తగు జాగ్రత్తలు పాటించి, సురక్షితంగా హైదరాబాద్ చేరుకొని పదవి స్వీకార మహోత్సవంలో పాల్గొని తిరిగి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోగలరని మనవి. మానకొండూర్ ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయం కవ్వంపల్లి సత్యనారాయణ, చేరుకోవాలని మనవి చేస్తున్నారు.