పయనించే సూర్యుడు మార్చి 12 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డిని కుమ్మర్ల సంఘం జిల్లా కమిటీ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మర్ల ఆరాధ దైవంగా భావించే కుమ్మర ఇంటి ఆడపడుచు, కవయిత్రి అతుకూరి మొల్లమాంబ జయంతిని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని వారు కోరారు. అలాగే హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై మొల్లమాంబ విగ్రహానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉరుకొండ రఘుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి మసిగుండ్ల వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు మధునాగుల సుల్తాన్, బొడ్డుపల్లి జంగయ్య, గౌరవ సలహాదారులు బొడ్డుపల్లి బాలస్వామి, మంతటి సర్పంచ్ సుగురు శ్రీనివాసులు, రాజకీయ విభాగం కో-కన్వీనర్ మరియు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బొడ్డుపల్లి రాములు పాల్గొన్నారు. అదేవిధంగా నాగర్ కర్నూల్ మండల అధ్యక్షులు బొడ్డుపల్లి చిన్న రాములు, బిజినపల్లి మండల అధ్యక్షులు మాడుగుల స్వామి, సింగిల్ విండో డైరెక్టర్ బొడ్డుపల్లి తిరుపతయ్యతో పాటు తిరుమల్ సుల్తాన్, బాలనాగులు, రాములు, గుండురు రాము తదితర కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.