యువత లక్ష్యసాధనలో ముందుండాలి

* ఉట్నూర్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యూత్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహణ * కాకతీయ యూనివర్సిటీ వీసీతో కలిసి పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

పయనించే సూర్యుడు మార్చ్ 12 ఉట్నూర్: ఉట్నూర్ కేంద్రంలోని పీఎంఆర్సీ ప్రాంగణం యువత ఉత్సాహంతో కళకళలాడింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత దేశ భవిష్యత్తు మాత్రమే కాదు వర్తమానాన్ని నిర్మించే శక్తి అని పేర్కొన్నారు విద్యార్థి దశలోనే లక్ష్యసాధనకు బలమైన పునాది వేయాలని సూచించారు ఎన్ఎస్ఎస్ కార్యకలాపాలు యువతలో సేవా భావం క్రమశిక్షణ సమాజంపై బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ తరహా యూత్ ఫెస్టివల్స్ విద్యార్థులకు తమ అంతర్గత ప్రతిభను బయటపెట్టే అద్భుత అవకాశమని అన్నారు మొత్తం 12 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రసంగం వ్యాసరచన సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడా పోటీలు వంటి విభిన్న అంశాల్లో విద్యార్థులు పాల్గొన్నారు పోటీలు కేవలం గెలుపుకోసం కాకుండా నేర్చుకోవడానికి, వ్యక్తిత్వ వికాసానికి వేదికగా భావించాలని ఎమ్మెల్యే సూచించారు తాను కూడా విద్యార్థి దశలో ఎన్ఎస్ఎస్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నానని గుర్తుచేసుకుంటూ ఆ అనుభవాలు తన జీవిత దిశను మార్చాయని చెప్పారు యువత పట్టుదల, కష్టపడి పనిచేసే స్వభావం అలవరచుకుంటే ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించగలరని అన్నారు. చదువుతో పాటు సమాజ సేవలో కూడా ముందుండాలని పిలుపునిచ్చారు కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. యువత తమ ప్రతిభను రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శించేలా సిద్ధం కావాలని సూచించారు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే యూత్ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నృత్యాలు గేయాలు వాదోపవాదాలు నిర్వహించి ఆకట్టుకున్నారు కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు విజేతలకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు యువతలో ఉత్సాహం క్రీడాస్ఫూర్తి సామాజిక చైతన్యం స్పష్టంగా కనిపించిన ఈ యూత్ ఫెస్టివల్ విజయవంతంగా ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *