
పయనించే సూర్యుడు న్యూస్: మార్చి/12: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్: సాయిరెడ్డి బొల్లం:రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్ద పెద్ద లింగాపూర్ లోని రంగనాయక సాగర్ 11/6 కాల్వ నిర్మాణ పనులు పూర్తి చేయాలని రైతులు పెద్దలింగాపూర్ గ్రామంలో గత నెల రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేపట్టిగ మానకొండూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్. దీక్షా శిబిరాన్ని సందర్శించినారు..అనంతరం వారు మాట్లాడుతూ ఎద్దు ఎడిచిన చోట ఎవుసం ఉండదు…రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలువదు..అని అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 11(ఆర్డీ3 ఎల్ఎం6) కాలువ పనులు పూర్తి చేయాలని ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, రామోజీపేట, తంగళ్లపల్లి మండలం నరసింహులపల్లి సహా 12 గ్రామాల రైతులు గత నెల రోజుల నుంచి దీక్షలో పాల్గొన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు లేదన్నారు..నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిపోయిందని, హామీలిచ్చుడే తప్ప నెరవేర్చడం లేదని అన్నారు. రైతులు రిలే నిరాహార దీక్ష చేసిన పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నాడు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి ఇల్లంతకుంట మండలానికి నీరందించేందుకు చేపట్టిన ఎల్ఎం6 కెనాల్ నిర్మాణ పనులు చివరి దశలో నిలిచిపోయిన విషయం అందరికి తెలిసిందేనన్నారు. సంవత్సరం క్రితం కెనాల్ పూర్తిచే యాలని ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ సబ్ స్టేషన్ సమీపంలో రైతులు నిరాహార దీక్ష చేస్తే మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వచ్చి ఆరు నెలల్లో పూర్తిచేస్తానని హామీఇచ్చారని, కానీ ఏడాది గడిచినా తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. కిలోమీటరున్నర కాలువ కోసం రైతులు పోరాటం చేస్తుంటే మాట ఇచ్చిన ఎమ్మెల్యే, ముందుండి నడుస్తామన్న కాంగ్రెస్ నాయకులు ఎక్కడికిపోయారని అన్నారు. సాగునీరు లేక ఏటా యాసంగిలో వందలాది ఎకరాల వరి, మక్క పంటలు చేతి కొచ్చే దశలో ఎండిపోతున్నాయని అన్నారు. మా హయాంలో ఇట్టి కాల్వపైన పూర్తి చేసాము ఇట్టి కలపని పూర్తి చేసామని సుమారు కిలోమీటర్ మాత్రం మిగిలి ఉందని అప్పటికే ఎలక్షన్ కోడ్ రావడం వలన అట్టి పని ఆగిపోయిందని, దురదృష్టవశాత్తు మేము అధికారంలో రాలేకపోయినామని, అది పనిచేయ లేకపోయినామని అన్నారు ఆర్థిక శాఖ నుంచి రైతులకు ఇవ్వాల్సిన రూ.3.20కోట్ల పరిహారం ఇవ్వ కుండా జాప్యం చేస్తున్నారని, రైతుల పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా ఎల్ఎం6 కెనాల్ పూర్తి చేయాలనని అన్నారు.సర్కారు నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని అన్నారు. అనంతరం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు (సబ్బుల బాలయ్య ) అనారోగ్యంతో గత కొద్దిరోజుల క్రితం మరణించగా ఈరోజు వారి కుటుంబ సభ్యుల పరమర్శించినారు..ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు , మరియు ఇల్లంతకుంట తంగళ్ళపల్లి మండలాల ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతితులు నాయకులు బి ఆర్ఎస్ కుటుంబ సభ్యులు రైతులు పాల్గొన్నారు.