రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ.

★ తెల్కపల్లి మండల ఎస్ ఐ. నరేష్ ఆధ్వర్యంలో ర్యాలీ.

పయనించే సూర్యుడు. మార్చి 12.నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం. రిపోర్టర్ :సుల్తాన్ నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సురక్షితంగా. గమ్యస్థానానికి చేరుకోండి లేదా క్షేమంగా వెళ్ళండి.పేరుతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో స్థానిక యువకులు, గ్రామస్థులు పాల్గొని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని, మద్యం సేవించి వాహనం నడపకూడదని పోలీస్ అధికారులు సూచించారు. రోడ్డు నియమాలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనం నడపాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్.వెంకటేష్, మరియు శ్రీను, పలువురు యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.