వితంతుల, ఆసరా పెన్షన్లని పెంచాలి

పయనించే సూర్యుడు 12-3-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ ( ఆవుల చందు) జగిత్యాల పట్టణం వితంతుల, మరియు ఆసరా పెన్షన్లని 4016/-రూ !! లకు పెంచాలాని కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన రాష్ట్ర బీసీ సంఘం నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలలకు కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం పట్ల హర్షిస్తున్నాము. కానీ, భర్తను కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వితంతువుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. నూతన వితంతు పెన్షన్ను మంజూరు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నది. అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నారు. 5 సంవత్సరాల నుండి గత ప్రభుత్వము వితంతు పెన్షన్ పెండింగ్ పెట్టినారు తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం నాయకులు రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *