పయనించే సూర్యుడు మార్చి 12 దౌల్తాబాద్ రాజేష్) దౌల్తాబాద్ మండలం మాచిన్ పల్లి గ్రామంలో, ఎం పి యు పి ఎస్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తమ విధులు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, అందరూ కలిసి స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా, మండల విద్యాధికారి గజ్జల కనకరాజు పాల్గొనడం జరిగింది. మండల విద్యాధికారి మాట్లాడుతూ, విద్యార్థులు అన్ని రంగాలలో ముందు ఉండాలని, ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, అందులో భాగంగా ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులను ప్రతి ఒక్కరిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో, మండల విద్యాధికారి గజ్జల కనకరాజు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పాల్గొనడం జరిగింది.